27న ఫిబ్రవరి నెల శ్రీవాణి టికెట్ల కోటా విడుదల

ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవాణి దర్శన టికెట్లను జనవరి 27వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు టిటిడి విడుదల చేయనుంది...

Update: 2023-01-25 16:16 GMT

దిశ, తిరుపతి: ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవాణి దర్శన టికెట్లను జనవరి 27వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు టిటిడి విడుదల చేయనుంది. శ్రీవాణి కింద ప్రతిరోజూ 1000 టికెట్లు జారీ చేస్తారు. ఇందులో 750 టికెట్లు ఆన్‌లైన్లో, 250 టికెట్లు కరెంట్ బుకింగ్‌లో అందుబాటులో ఉంటాయి. భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ పేర్కొంది. 

Similar News