Elphants Fear: చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం

చిత్తూరు జిల్లా జైరెడ్డిపల్లి మండలంలో 15 ఏగునులు హల్ చల్ చేశాయి. సమీప అడవుల్లోంచి జనావాల్లోకి వెళ్లి బీభత్సం సృష్టిస్తున్నాయి. పంట పొలాలను కూడా ధ్వంసం చేస్తున్నాయి. ..

Update: 2022-11-24 14:11 GMT

దిశ వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా జైరెడ్డిపల్లి మండలంలో 15 ఏనుగులు హల్ చల్ చేస్తున్నాయి. సమీప అడవుల్లోంచి జనావాసాల్లోకి వెళ్తున్నాయి. గ్రామాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. అరటి, చెరుకు, టమోటా, వరి సహా అన్ని పంటలను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పొలాలకు వెళ్లాలంటేనే జంకిపోతున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి ఏనుగులను అడవుల్లోకి తరిమివేయాలంటున్నారు. ఎప్పుడు ఏం చేస్తాయోనని భయపడిపోతున్నారు. తరచూ ఏనుగులు వస్తున్నాయని.. శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. 

Similar News