దేవినేని ఉమకు కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు

వచ్చే ఎన్నికల్లో సీటు దక్కలేదనే నిరాశలో ఉన్న టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమకు చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు..

Update: 2024-03-29 14:13 GMT

దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమకు సీటు దక్కలేదని నిరాశలో ఉన్నారు. దీంతో ఆయనకు అధినేత చంద్రబాబు ఊరట కల్పించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమన్వయ బాధ్యతలను అప్పగించారు. దేవినేని ఉమ ఇప్పటికే టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పుడు ఈ హోదాతో పాటు అదనపు బాధ్యతలను దేవినేని ఉమకు చంద్రబాబు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

కాగా కృష్ణా జిల్లా మైలవరం సీటుపై దేవినేని ఉమ ఆశ పెట్టుకున్నారు. అక్కడి నుంచి పోటీ చేసి గెలవాలనే ప్లాన్ ఉన్న ఆయన అధినేత ఝలక్ ఇచ్చారు. ఇటీవల పార్టీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కే ఆ సీటు కేటాయించారు. దీంతో మనస్థాపం చెందిన దేవినేని ఉమను చంద్రబాబు బుజ్జగించారు. చివరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Read More..

Ap Elections 2024:ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ అభ్యర్థి కుమార్తె!

Tags:    

Similar News