AP:ఏపీలో అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు తోనే సాధ్యం:టీడీపీ అభ్యర్థి

మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి తండాలో కూటమి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలవడం ఖాయమని పుట్టపర్తి నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు.

Update: 2024-05-09 15:25 GMT

దిశ ప్రతినిధి,పుట్టపర్తి: మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి తండాలో కూటమి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలవడం ఖాయమని పుట్టపర్తి నియోజకవర్గం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. గురువారం పుట్టపర్తి మున్సిపల్ పరిధిలోని బ్రాహ్మణపల్లి తాండ బీడు పల్లి గ్రామంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వైసీపీ పార్టీ గల్లంతు కావడం ఖాయం అన్నారు. వైసీపీకి కాలం చెల్లిందని పేర్కొన్నారు. ప్రజల భవిష్యత్తు కోసం చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

సత్యసాయి జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు రావాలంటే టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి, హిందూపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పార్థసారథి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. పుట్టపర్తి నియోజకవర్గంలో వైసిపి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మళ్ళీ గెలిస్తే ప్రజలకు నిలువు దోపిడీ తప్పదన్నారు. వైసీపీ పాలనలో ఎక్కడ చూసినా నియోజకవర్గంలో అవినీతి సాగిందని పేర్కొన్నారు. 193 చెరువులకు హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా నీటిని ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం కనీసం ఈ ఐదేళ్లలో ఒక చుక్క నీరు కూడా గుంతలకు ఇచ్చింది లేదన్నారు. మళ్లీ ఎన్నికల సమయంలో 193 చెరువులకు నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన ఈ పెద్ద మనిషి ఓట్లు అడగడానికి సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ,జనసేన,బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Similar News