జనసేనకు బిగ్ షాక్..వైసీపీలోకి పితాని బాలకృష్ణ?

జనసేన పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు మద్దతిచ్చిన జనసైనికులు ఒక్కొక్కరుగా ఆ పార్టీని విడిచి పోవడానికి సిద్ధమవుతున్నారు.టీడీపీ, జనసేన,బీజేపీ కూటమి వల్ల సీటు కోల్పోయిన పలువురు జనసైనికులు పక్క పార్టీల వైపు దృష్టి సారిస్తున్నారు.

Update: 2024-03-28 09:22 GMT

దిశ ప్రతినిధి,ఉభయగోదావరి:జనసేన పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు మద్దతిచ్చిన జనసైనికులు ఒక్కొక్కరుగా ఆ పార్టీని విడిచి పోవడానికి సిద్ధమవుతున్నారు.టీడీపీ, జనసేన,బీజేపీ కూటమి వల్ల సీటు కోల్పోయిన పలువురు జనసైనికులు పక్క పార్టీల వైపు దృష్టి సారిస్తున్నారు.గత ఎన్నికల్లో ముమ్మిడివరం అసెంబ్లీకి పోటీ చేసిన పితాని బాలకృష్ణ మరల ముమ్మిడివరం టికెట్ ఆశించారు. అయితే పొత్తులో భాగంగా టీడీపీకి చెందిన దాట్ల బుచ్చిబాబు అసెంబ్లీ అభ్యర్థి గా ఖరారు కావడంతో పితానికి నిరాశ ఎదురైంది.

జనసేన ఏర్పడిన తొలినాళ్లలో పర్యటించిన పవన్ కళ్యాణ్ పితాని బాలకృష్ణకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. కాగా వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణ కి సీటు దక్కకపోవడంతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు.గత కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్న బాలకృష్ణ వైసీపీకి చెందిన గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి తో భేటీ అయ్యారు.ఈ నెల 30న జగన్ సమక్షంలో వైసీపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు.

Similar News