టీడీపీకి బిగ్ షాక్.. పార్టీకి కీలక నేతల రాజీనామా

ఈ రోజు జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో 94 మంది అభ్యర్తులను ప్రకటించిన విషయం తెలిసిందే.

Update: 2024-02-24 11:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజు జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో 94 మంది అభ్యర్తులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రోజు ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో పేర్లు లేని నాయకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీంతో టీడీపీ, జనసేన తొలి జాబితాలో చోటు దక్కని టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తపరుస్తూ.. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో గజపతినగరం టీడీపీ ఇన్ ఛార్జ్ కొండపల్లి అప్పలనాయుడు మొదట తన రాజీనామాను ప్రకటించారు. అతను పోటీ చేయాలనుకున్న స్థానం నుంచి కొండపల్లి శ్రీనివాసరావుకు టికెట్ కేటాయించడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు.

అలాగే విశాఖ పశ్చిమ సీటు ఆశించిన పాశర్ల ప్రసాద్ కు కూడా బంగపాటు కలగడంతో టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు. వీరితో పాటుగా రాయచోటి నుంచి పోటీలో నిలవాలని చూసిన రమేష్ రెడ్డి తొలి జాబితాలో చోటు దక్కకపోవడంతో ఆయన అనుచరులతో పాటు రాజీనామా చేయడానికి సిద్ధం అయినట్లు తెలుస్తుంది. దీంతో ఈ రోజు ప్రకటించిన జాబితా కారణంగా ఎంతమంది ఆ పార్టీకి రాజీనామా చేస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.

Read More..

తుప్పు పట్టిన సైకిల్.. పగిలిపోయిన గ్లాస్ అంటూ ఏపీ మంత్రి సెటైర్స్  

Tags:    

Similar News