Ap Skill Development Scam Caseలో కీలక పరిణామం.. ఈడీ కస్టడీకి నిందితులు

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కీలక పరిణామంచోటు చేసుకుంది...

Update: 2023-03-13 11:33 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కీలక పరిణామంచోటు చేసుకుంది. నలుగురు నిందితులను ఈడీ కస్టడీకి హైకోర్టు అనుమతించింది. మొత్తం 7 రోజుల పాటు కస్టడికి ఇవ్వాలన్న ఈడీ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం అనుమతి జారీ చేసింది. దీంతో అధికారులు మంగళవారం నలుగురు నిందితులను కస్టడీలో విచారించనున్నారు.

ఇప్పటికే ఈ కేసులో సీమెన్స్ మాజీ ఎండీ శేఖర్ బోస్, డీజీ టెక్ ఎండీ వికాశ్ వినాయక్, పీపీఎస్పీ ఐటీ స్కిల్స్ ప్రాజెక్టు సీవోవో ముకుల్ చంద్ర అగర్వాల్, ఎస్ఎస్ఆర్ సోసియేట్స్ సురేశ్ గోయల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విశాఖ స్పెషల్ కోర్టు వీరికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం వీరు రిమాండ్ ఉంది. అయితే కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం నలుగురు నిందితులనూ కస్టడీకి అనుమతించింది. 

Tags:    

Similar News