అసలు ఏం చేశారు.. ఎందుకు సిద్ధం: సీఎం జగన్‌పై పవన్ ఫైర్

ఏపీ సీఎం జగన్ పాలనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నల వర్షం కురిపించారు...

Update: 2024-05-02 11:47 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ పాలనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో కూటమి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ మేమంతా సిద్ధం అంటున్న జగన్‌పై విరుచుకుపడ్డారు. ఐదేళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని.. అసలు జగన్ దేనికి సిద్ధమని జనసేనాని ప్రశ్నించారు. మేనిఫెస్టోలో చెప్పిన చాలా హామీలను జగన్ అమలు చేయలేదన్నారు. జగన్‌కు ఓటు అడిగే అర్హత ఏమాత్రం లేదని మండిపడ్డారు. మద్యపానం నిషేధం అంటూ ప్రభుత్వమే మద్యం అమ్మిందని పవన్ గుర్తు చేశారు. గత ప్రభుత్వ రంగులు తీయడానికి జగన్ ప్రభుత్వం రూ. 2, 300 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. ఆ సొమ్మలో కొంత అయినా ఖర్చు పెట్టి ఉంటే ఉత్తరాంధ్రలో పంటలకు నీరందేదని చెప్పారు. తోటపల్లి రిజర్వాయర్ ఎందుకు పూర్తి చేయలేకపోయారని నిలదీశారు. దోపిడీపై ఉత్తరాంధ్ర ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు. అలా చేస్తేనే రిజర్వాయర్లు పూర్తి అవుతాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

Tags:    

Similar News