APలో పెరిగిన రైతు ఆత్మహత్యలు.. లెక్కలతో సహా వివరాలు వెల్లడించిన కేంద్రం

దేశానికి అన్నం పెట్టే అన్నదాత ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఆరుగాలం పండించిన పంటకు గిట్టు బాటులేక చేసిన అప్పులు తీర్చలేక దుక్కిదున్నిన చోటే తనువు చాలిస్తున్నారు. రైతే రాజు అని అంటారు...

Update: 2022-12-09 15:07 GMT

దిశ వెబ్ డెస్క్: దేశానికి అన్నం పెట్టే అన్నదాత ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఆరుగాలం పండించిన పంటకు గిట్టు బాటులేక చేసిన అప్పులు తీర్చలేక దుక్కిదున్నిన చోటే తనువు చాలిస్తున్నారు. రైతే రాజు అని అంటారు.. కాని ఇప్పుడు ఆ రైతే కనిపించని పరిస్థితి దేశంలో నెలకొంది. ఎండనకా వాననకా భూమిని అన్నపూర్ణగా తీర్చిదిద్ది చివరకు బలవంతంగా ఆ మట్టిలోనే కలిసిపోతున్నారు. ఈ విషయం సాక్షాత్తు కేంద్రప్రభుత్వమే చెబుతోంది. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో రైతుల ఆత్మహత్యలపై కేంద్రం సంచలన ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు పెరిగాయని.. 2019 నుంచి 2021 కాలంలో ఈ సంఖ్య మరింత అయిందని పేర్కొంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీలోనే ఎక్కువగా రైతులు బలవన్మరణాలకు పాల్పడినట్లు స్పష్టం చేసింది. ఒక్క ఏపీలోనే 1673 మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపింది. రాజ్యసభ సాక్షిగా రైతు ఆత్మహత్యలపై లెక్కలతో సహా వివరించింది. 2019లో 628 మంది, 2020లో 564, 2021లో 481 ఆత్మహత్య చేసుకున్నారని కేంద్రం వెల్లడించింది. కొన్ని రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని ప్రకటించింది. ఇదిలా ఉంటే ఏపీలో రైతు ఆత్మహత్యలు పెరగడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరంతరం రైతు జపం చేసే సీఎంకు వారి ఆత్మహత్యలు కనిపించడం లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 

Similar News