Breaking: అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీశా సస్పెండ్.. కారణం ఇదే

గతంలో ఏపీలో ఎన్నికల సంఘం ఆదేశాలను ఖాతరు చేయకుండా ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులపై ఈసీ దృష్టి సారించింది.

Update: 2024-01-19 12:21 GMT

దిశ వెబ్ డెస్క్: గతంలో ఏపీలో ఎన్నికల సంఘం ఆదేశాలను ఖాతరు చేయకుండా ఏకపక్షంగా వ్యవహరించిన అధికారులపై ఈసీ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీశా సస్పెండ్ అయిన విషయం అందరికి సుపరిచితమే. సస్పెన్షన్ కాలంలో హెడ్ క్వార్టర్స్ విజయవాడ వదిలి వెళ్లొద్దని గిరీషాకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో తిరుపతి ఆర్వోగా విధులు నిర్వహించారు గిరీశా.

ఈ నేపథ్యంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో అప్పటి ఆర్వోగా వ్యవహరించిన గిరీషా తన లాగిన్‌ను దుర్వినియోగ చేస్తూ తన లాగిన్ నుంచి 30 వేలకు పైగా నకిలీ ఓటర్ కార్డులు సృష్టించినట్లు ఎన్నికల కమిషన్ గుర్తించింది. ఈ క్రమంలో ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న గిరీశాను ఈసీఐ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తూ కలెక్టర్‌ సీఎస్ జవహర్‌ రెడ్డి జీవో జారీ చేశారు. అలానే సస్పెన్షన్ కాలంలో హెడ్ క్వార్టర్స్ విజయవాడ వదిలి వెళ్లొద్దని గిరీషాకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.   

Read More..

ఇప్పటి దాకా అమెరికా.. ఇక నుంచి విజయవాడ.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు  

Tags:    

Similar News