Cpi Strong Warning: నోరు అదుపులో పెట్టుకో.. మిస్టర్ తోపుదుర్తి!

మిస్టర్ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మీరు నోరు అదుపులో పెట్టుకోవాలి ... మీది వలసలు ఆపలేని చేతకాని ప్రభుత్వం ... రాష్ట్రంలో మీరు ధృతరాష్ట్ర పాలన సాగిస్తున్నారు...

Update: 2022-11-26 13:30 GMT

దిశ, ధర్మవరం : 'మిస్టర్ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి  నోరు అదుపులో పెట్టుకోవాలని అని శ్రీ సత్యసాయి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ సూచించారు. వలసలు ఆపలేని చేతకాని ప్రభుత్వం తమదని.... రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన సాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తమ నాయకుడు రామకృష్ణను విమర్శించే హక్కు తోపుదుర్తికి లేదన్నారు.  ధర్మవరం ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ  రామకృష్ణపై మాట్లాడే ముందు తోపుదుర్తి స్థాయి ఏమిటో తెలుసుకోవాలన్నారు. క్రిమినల్ రికార్డులతో జైలుకి వెళ్ళిన చరిత్ర తోపుదుర్తిది అని విమర్శించారు.  సొంత ఊరికి రోడ్డు వేస్తుంటే అడ్డుపడిన మీరా విమర్శించేదని నిలదీశారు. కమ్యూనిస్టులు కేవలం పేద, బడుగు,బలహీన వర్గాల కోసమే పోరాటాలు చేస్తారని గుర్తు చేశారు.

'ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎక్కువ ఉన్న జిల్లా అనంతపూర్ జిల్లా. ఈ జిల్లాలో పరిశ్రమలు వస్తుంటే సహకరించాల్సిన మీరు, అడ్డుకోవడం సబబు కాదు. మేము ప్రశ్నిస్తే రుచించలేక, ఎక్కడ తప్పులు బయటపడతాయని మాపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే మన జిల్లాలో పరిశ్రమలు లేక డిగ్రీలు, పీజీలు, చేసిన విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్తున్నారు. ఆ వలసలు ఆపేది పోయి వచ్చిన పరిశ్రమలు కూడా భయపెట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయి. ఇది ఎంతవరకు సబబు. ఈ జిల్లాలో జాకీ పరిశ్రమ ఏర్పాటు చేసి ఉంటే వందల ఉద్యోగ అవకాశాలు వచ్చేవి. ప్రజా సేవకు విద్యార్థి, యువతకు ఉపయోగపడే పనులు చేయాలి. స్వార్థ రాజకీయాలు మాని ప్రజా సంక్షేమపై దృష్టి సారించాలి. కమ్యూనిస్టులపై నోరు పారేసుకుంటే తగిన విధంగా బుద్ధి చెబుతాం.'' అని తోపుదుర్తిని వేమయ్య యాదవ్ హెచ్చరించారు.

కాగా మీడియా సమావేశానికి ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి జింక చలపతి, రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ కార్యదర్శి కాటమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం గంగాధర్, సిపిఐ నియోజక వర్గ కార్యదర్శి మధు, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి బయన్న,సిపిఐ పట్టణ కార్యదర్శి రవి, చెన్నేకొత్తపల్లి మండల కార్యదర్శి రాము, తదితరులు హాజరయ్యారు.

READ MORE

Minister Roja మళ్లీ జబర్దస్త్‌కు వెళ్తే బెటర్: Vangalapudi Anitha 

Tags:    

Similar News