వైసీపీ నేతలకు టీడీపీ ఎమ్మెల్యే అనగాని సవాల్

దిశ, ఏపీ బ్యూరో: రెండున్నర సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్రంలోని కాపు కులస్తులను ఆదుకోవడంలో విఫలమయ్యారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. అమరావతిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కాపు నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. కాపు విద్యార్థులకు విదేశీ విద్య, నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కాపులకు అమలు చేసిన సంక్షేమ పథకాలు రద్దు చేశారని దుయ్యబట్టారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపు […]

Update: 2021-10-14 06:04 GMT

దిశ, ఏపీ బ్యూరో: రెండున్నర సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్రంలోని కాపు కులస్తులను ఆదుకోవడంలో విఫలమయ్యారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. అమరావతిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కాపు నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. కాపు విద్యార్థులకు విదేశీ విద్య, నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కాపులకు అమలు చేసిన సంక్షేమ పథకాలు రద్దు చేశారని దుయ్యబట్టారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే దానిని సీఎం జగన్ నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. కాపులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 5 శాతం రిజర్వేషన్లను రద్దు చేసి కాపు విద్యార్థుల జీవితాలతో సీఎం జగన్ ఆడుకుంటున్నారని సత్యప్రసాద్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాలలో కాపు కులస్తులకు ఏం పనులు చేశారో చర్చకు సిద్ధమా? అని ప్రభుత్వానికి సవాల్ చేశారు. తన సవాల్ ను స్వీకరించి చర్చకు రావాలని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వైసీపీ నేతలను డిమాండ్ చేశారు.

Tags:    

Similar News