ఆ విషయంలో సమంత మమ్మల్ని నమ్మింది.. బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్ : పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈ వెంట్ ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన, హీరోహిరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక విడాకుల అనంతరం సమంత మొదటి సారి పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేయడంతో ఈ సినిమాకు క్రేజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు. అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఇటు సమంత ఫ్యాన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు […]
దిశ, వెబ్‌డెస్క్ : పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈ వెంట్ ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన, హీరోహిరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక విడాకుల అనంతరం సమంత మొదటి సారి పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేయడంతో ఈ సినిమాకు క్రేజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు. అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఇటు సమంత ఫ్యాన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల రిలీజ్ అయిన ఐటమ్ సాంగ్‌ను ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఇందులో సమంత తన అందాల ఆరబోతతో, అదిరిపోయే స్టేప్పులతో అలరించనున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.
అయితే నిన్న జరిగిన పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈ వెంట్లో అల్లు అర్జున్ సమంత గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమంత ఐటమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకుంటదని అనుకోలేదు, సామ్ ఐటమ్ సాంగ్‌కు థాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా సమంత ఓ స్టార్ హీరోయిన్, స్టార్ హీరోయిన్స్ అన్నాక కొన్ని పరిమితులు ఉంటాయి, కానీ అవన్నీ లెక్క చేయకుండా సుకుమార్ అడగగానే సమంత ఐటమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తను మమ్మల్ని నమ్మి, మేము అవుట్ పుట్ ఎలా అడిగితే అలా చేసిందని చెప్పుకొచ్చారు. సమంత సైలెంట్‌గా వచ్చి తన పని తానూ చేసుకొని వెళ్లిపోయింది. తన పాత్రకు 100 శాతం న్యాయం చేసిందని ఈ సందర్భంగా సమంతకు సభాముఖంగా థాంక్స్ అంటూ అల్లు అర్జున్ సమంతకు థాంక్స్ చెప్పారు.