శ్వేత సూసైడ్ కేసులో నిందితుడి అరెస్ట్

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని శ్వేత ఆత్మహత్య కేసు మిస్టరీ వీడింది. శ్వేత మృతికి కారణమైన అజయ్‌ను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. శ్వేత మాట్లాడిన ఆడియో టేపులు బయటకు రావడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. సోషల్‌ మీడియాలో శ్వేత ఫోటోలను పోస్టు చేసి, వేధించడం కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు నిర్థారించారు. దీంతో అజయ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ టేపులో అజయ్‌ తల్లి, సోదరితో […]

Update: 2020-10-13 11:59 GMT

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని శ్వేత ఆత్మహత్య కేసు మిస్టరీ వీడింది. శ్వేత మృతికి కారణమైన అజయ్‌ను పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. శ్వేత మాట్లాడిన ఆడియో టేపులు బయటకు రావడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. సోషల్‌ మీడియాలో శ్వేత ఫోటోలను పోస్టు చేసి, వేధించడం కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు నిర్థారించారు. దీంతో అజయ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ టేపులో అజయ్‌ తల్లి, సోదరితో శ్వేత ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. తన ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేసి వేధిస్తున్నాడని అజయ్ తల్లికి, సోదరికి శ్వేత ఫోన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ ఫోటోలు తొలగించాలని చెబుతున్నా వినడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎలాగైనా వాటిని తొలగించేలా చూడాలని శ్వేత బతిమాలినట్లు ఆ ఆడియో టేపుల్లో ఉంది.

Tags:    

Similar News