శ్రీశైలం సత్రంలో ఘర్షణ.. వ్యక్తి మృతి

దిశ,వెబ్‌డెస్క్: శ్రీశైలంలోని ఓ ప్రైవేటు సత్రంలో భక్తులు, సత్రం సిబ్బందికి మధ్య మంగళవారం ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో సత్రం మేనేజర్‌ మరణించారు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీశైలంలో కాకతీయ కమ్మవారి సత్రంలో భోజనం చేసేందుకు నలుగురు భక్తులు వెళ్లారు. సత్రంలో కూర్చోనే భోజనం చేస్తామంటూ సదరు భక్తులు పట్టుపట్టారు. కాగా నిబంధనల ప్రకారం అలా తినేందుకు అనుమతి లేదని భక్తులకు సత్రం సూపర్‌వైజర్ శ్రీనివాసరావు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆయన చెప్పిన మాటలతో […]

Update: 2020-12-29 10:32 GMT

దిశ,వెబ్‌డెస్క్: శ్రీశైలంలోని ఓ ప్రైవేటు సత్రంలో భక్తులు, సత్రం సిబ్బందికి మధ్య మంగళవారం ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో సత్రం మేనేజర్‌ మరణించారు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీశైలంలో కాకతీయ కమ్మవారి సత్రంలో భోజనం చేసేందుకు నలుగురు భక్తులు వెళ్లారు. సత్రంలో కూర్చోనే భోజనం చేస్తామంటూ సదరు భక్తులు పట్టుపట్టారు. కాగా నిబంధనల ప్రకారం అలా తినేందుకు అనుమతి లేదని భక్తులకు సత్రం సూపర్‌వైజర్ శ్రీనివాసరావు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.

కానీ ఆయన చెప్పిన మాటలతో భక్తులు సంతృప్తి చెందలేదు. దీంతో మేనేజర్ శ్రీనివాస్ రావుతో వారు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో శ్రీనివాస్ రావు కిందపడి పోవడంతో ఆయనకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆయనను ఆస్పత్రికి తరలించేందుకు ఇతర సిబ్బంది ప్రయత్నించారు. కానీ ఈలోపే ఆయన మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News