‘ఓలా’కు షాకిచ్చిన లండన్

దిశ, వెబ్‌డెస్క్: ఓలా క్యాబ్స్‌కు ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్ భారీ షాక్ ఇచ్చింది. లండన్‌‌లో తన కార్యాకలాపాలు ప్రారంభించిన ఓలాకు ఆపరేటర్ లైసెన్స్‌ను టీఎఫ్ఎల్ తిరస్కరించింది. అంతేకాకుండా ఓలాతో ప్రయాణం ప్రయాణికులకు అంత సురక్షితం కాదని హెచ్చరించింది. పలు పొరపాట్లు ఉన్నాయని.. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి లైసెన్స్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఇదే సంవత్సరం ఫిబ్రవరిలోనే ఓలా లండన్‌లో ట్యాక్సీ సేవలను ప్రవేశపెట్టింది. అయితే, ప్యాసింజర్ల సేఫ్టీ పై నిఘా వేసిన టీఎఫ్ఎల్ ప్రతినిధులు లోపాలున్నాయని […]

Update: 2020-10-05 09:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఓలా క్యాబ్స్‌కు ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్ భారీ షాక్ ఇచ్చింది. లండన్‌‌లో తన కార్యాకలాపాలు ప్రారంభించిన ఓలాకు ఆపరేటర్ లైసెన్స్‌ను టీఎఫ్ఎల్ తిరస్కరించింది. అంతేకాకుండా ఓలాతో ప్రయాణం ప్రయాణికులకు అంత సురక్షితం కాదని హెచ్చరించింది. పలు పొరపాట్లు ఉన్నాయని.. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి లైసెన్స్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది.

ఇదే సంవత్సరం ఫిబ్రవరిలోనే ఓలా లండన్‌లో ట్యాక్సీ సేవలను ప్రవేశపెట్టింది. అయితే, ప్యాసింజర్ల సేఫ్టీ పై నిఘా వేసిన టీఎఫ్ఎల్ ప్రతినిధులు లోపాలున్నాయని చెప్పారు. లైసెన్స్ లేకుండానే ట్యాక్సీ డ్రైవర్లు సేవలు కొనసాగిస్తున్నారని టీఎఫ్ఎల్‌ స్పష్టం చేసింది. ఈ కారణంతోనే లైసెన్స్‌ను తిరస్కరించామని చెప్పింది.

ఇక ఇదే వ్యవహారం పై స్పందించిన ఓలా క్యాబ్స్ తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. అన్ని షరతులను పాటిస్తూ.. టీఎఫ్ఎల్ నుంచి ఆమోదం పొందిన తర్వాతే సేవలను కొనసాగిస్తామంది. అయితే, టీఎఫ్‌ఎల్ లైసెన్స్ క్యాన్సిల్ చేసినా.. అప్పిల్ చేసుకునేందుకు 21 రోజుల సమయం ఉంది. అయినా.. నమ్మకం కల్పించి.. టీఎఫ్ఎల్‌తో కలిసే పని చేస్తామని ఓలా యూకే మేనేజింగ్ డైరెక్టర్ మార్క్ రోజెన్‌డాల్ ధీమా వ్యక్తం చేయడం గమనార్హం.

Tags:    

Similar News