ఐపీఎల్ 2024: ఆర్సీబీ, పంజాబ్ జట్లకు చావో రేవో మ్యాచ్.. ఓడితే ఇంటికే

ఐపీఎల్ 2024 లో భాగంగా ఈ రోజు అత్యంత కీలకమైన మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ లో చిరవి బంతి వరకు గెలుపు కోసం పోరాడుతున్న పంజాబ్, సీజన్ మొదటి నుంచి ట్రోఫీ కోసం ఎదురు చూస్తున్న ఆర్సీబీ జట్ల మధ్య 58వ మ్యాచ్ జరగనుంది.

Update: 2024-05-09 08:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 లో భాగంగా ఈ రోజు అత్యంత కీలకమైన మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ లో చిరవి బంతి వరకు గెలుపు కోసం పోరాడుతున్న పంజాబ్, సీజన్ మొదటి నుంచి ట్రోఫీ కోసం ఎదురు చూస్తున్న ఆర్సీబీ జట్ల మధ్య 58వ మ్యాచ్ జరగనుంది. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరగనుండగా.. ఇరు జట్లకు గెలుపు అనివార్యం అయింది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 11 మ్యాచులు ఆడి నాలుగు విజయాలతో ఆర్సీబీ 7వ స్థానంలో, పంజాబ్ 8వ స్థానంలో కొనసాగుతన్నాయి. వీరికి మరో మూడు మ్యాచులు ఉండగా ప్లేఆఫ్ చేరాలంటే ప్రతి మ్యాచ్ లో విజయం సాధించాల్సి ఉంది. కాగా ఈ రోజు జరిగే మ్యాచ్ లో ఎ జట్టు అయితే ఓడిపోతుందో అధికారింగా ప్లే ఆఫ్ నుంచి ఎలిమినేట్ అయ్యే రెండో జట్టు గా నిలవనుంది. కాగా ఆర్సీబీ జట్టు వరుసగా మూడు విజయాలతో ప్లే ఆఫ్ కోసం దూసుకొస్తుండగా.. పంజాబ్ చివరి మ్యాచులో ఓడిపోయి గెలుపు కోసం చూస్తుంది. మరి ఈ రోజు రాత్రి జరిగే మ్యాచ్ లో ఎవరు గెలిచి ప్లే ఆఫ్ రేసులో కొనసాగుతారో తెలియాలంటే మ్యాచ్ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే మరి.

పంజాబ్ కింగ్స్ అంచనా జట్టు: జానీ బెయిర్‌స్టో, రిలీ రోసౌ, శశాంక్ సింగ్, సామ్ కర్రాన్ (సి), జితేష్ శర్మ (వికె), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (సి), విల్ జాక్స్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్), కర్ణ్ శర్మ, స్వప్నిల్ సింగ్, మహ్మద్ సిరాజ్, యష్ దయాల్, విజయ్‌కుమార్ వైషాక్

Similar News