రోహిత్‌‌‌కు ఇంగ్లీష్ రాదు.. కానీ : హిట్‌మ్యాన్‌పై యువీ ఆసక్తికర వ్యాఖ్యలు

. త్వరలో ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్‌కు యువరాజ్ సింగ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-05-07 13:31 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రశంసలతో ముంచెత్తాడు. త్వరలో ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్‌కు యువరాజ్ సింగ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రోహిత్ గురించి యువీ మాట్లాడిన వీడియోను ఐసీసీ పంచుకుంది. ఆ వీడియోల యువరాజ్ మాట్లాడుతూ.. రోహిత్ ఎన్నో విజయాలు సాధించినా అతడి వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులు మార్పు లేదన్నాడు. టీ20 ప్రపంచకప్‌ జట్టులో రోహిత్ ఉండటం ఎంతో కీలకమని చెప్పాడు. ‘మనకు తెలివైన కెప్టెన్ కావాలి. ఒత్తిడిలో కూడా సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అందుకు రోహిత్ సరైనవాడు. గతేడాది వన్డే వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియాను ఫైనల్‌కు చేర్చాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఐదు టైటిల్స్ గెలిచాడు. భారత్‌కు రోహిత్ లాంటి కెప్టెన్ కావాలి.’ అని కొనియాడాడు.

ఈ సందర్భంగా రోహిత్ భారత జట్టులో చేరిన తొలినాళ్ల రోజులను యువీ గుర్తు చేసుకున్నాడు. ‘రోహిత్‌కు సరిగా ఇంగ్లీష్ రాదు. సరదాగా ఉండేవాడు. మేము అతన్ని ఎప్పుడూ ఆటపట్టించేవాళ్లం. కానీ, అతను గొప్ప మనసున్న వ్యక్తి. అతను ఎన్నో విజయాలు సాధించాడు. కానీ, అతని వ్యక్తిత్వం కొంచెం కూడా మారలేదు. రోహిత్ శర్మలో గొప్ప గుణం అదే. రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలనుకుంటున్నా. అందుకు అతను అర్హుడు.’ అని యువీ తెలిపాడు. 

Tags:    

Similar News