టీ20 వరల్డ్ కప్: కెప్టెన్సీ మార్పుపై రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిన కొద్ది రోజులకే టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. దీనికోసం బీసీసీఐ మొత్తం 15 మంది ప్లేయర్లతో కూడిన జట్టును ప్రకటించింది.

Update: 2024-05-02 12:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 సీజన్ ముగిసిన కొద్ది రోజులకే టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. వరల్డ్ కప్ కోసం బీసీసీఐ మొత్తం 15 మంది ప్లేయర్లతో కూడిన జట్టును ప్రకటించింది. కాగా ఈ రోజు టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పాటు ఇతర బీసీసీఐ ప్రతినిధులు భేటీ అయ్యారు. అనంతరం కెప్టెన్ రోహిత్, అజిత్ అగార్కర్‌తో కలిసి ప్రేస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ మీడియాతో మాట్లాడుతూ.. టీ20 వరల్డ్ కప్ కెప్టెన్సీ మార్పు పై కీలక వ్యాఖ్యలు చేశారు. "నేను గతంలో టీ20 జట్టు కెప్టెన్‌గా ఉన్నాను. ఆ తర్వాతి సీజన్‌లో కెప్టెన్‌గా లేను. ఆపై మళ్లీ కెప్టెన్‌గా భాద్యతలు తీసుకున్నారు.ఇది జీవితంలో ఒక భాగం. ప్రతి విషయం మనం అనుకున్న మార్గంలో జరగదు. ఇది గొప్ప అనుభవం. నా జీవితంలో ఇంతకు ముందు నేను చేయలేదు. కెప్టెన్‌గా ఉండి, చాలా మంది కెప్టెన్‌ల కింద ఆడడం నాకు కొత్తేమీ కాదని రోహిత్ శర్మ చెప్పుకొచ్చారు.

Similar News