టీ20 వరల్డ్ కప్: అమెరికా జట్టులో న్యూజిలాండ్ విద్వంసకర ఆల్ రౌండర్

క్రికెట్ ప్రపంచంలో ఆడాలని ఆశలు ఉన్న ఎంతో మంది ప్లేయర్లు అవకాశాలు రాక ఇతర దేశాలకు వెళ్లి అక్కడ స్థానం దక్కించుకుని ఆ దేశ జట్లలో కీలక ప్లేయర్లుగా పేరుగాంచారు.

Update: 2024-05-04 09:33 GMT

దిశ, వెబ్ డెస్క్: క్రికెట్ ప్రపంచంలో ఆడాలని ఆశలు ఉన్న ఎంతో మంది ప్లేయర్లు అవకాశాలు రాక ఇతర దేశాలకు వెళ్లి అక్కడ స్థానం దక్కించుకుని ఆ దేశ జట్లలో కీలక ప్లేయర్లుగా పేరుగాంచారు. ఈ లిస్టులో చాలామంది ప్లేయర్లు ఉంటారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న అన్ని జట్లలో భారత సంతతికి చెందిన ప్లేయర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే 2018వరకు న్యూజిలాండ్ జట్టులో కీలక ఆల్ రౌండర్‌గా ఉన్న కోరీ అండర్సన్ గురించి ప్రతి ఒక్కరికి తేలుసు. అతను ఐపీఎల్ లో కూడా కీలక ప్లేయర్ గా రాణించారు. కాగా 33 ఏళ్ల అండర్సన్ జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ లో అమెరికా జట్టు తరఫున ఆడనున్నాడు. ఇటీవల అమెరికా ప్రకటించిన వరల్డ్ కప్ జట్టులో అతనికి స్థానం దక్కింది. కోరీ అండర్సన్ న్యూజిలాండ్ తరపున రెండు T20 ప్రపంచ కప్‌లలో ఆడాడు. 2015లో 50 ఓవర్ల ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన జట్టు సభ్యుడు. అతను చివరిసారిగా 2018లో న్యూజిలాండ్ తరఫున ఆడాడు.


Similar News