కొవిడ్ ఎఫెక్ట్.. శంషాబాద్ నుంచి 30 విమాన సర్వీసులు రద్దు..

దిశ, రాజేంద్రనగర్ : కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్, కర్ఫ్యూ ఉండటం కారణంగా శంషాబాద్ విమానాశ్రయం నుండి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన 30 విమానాలను ఎయిర్ పోర్టు అధికారులు రద్దు చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుండి ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వెళ్లాల్సిన దాదాపు 30 సర్వీసులు క్యాన్సిల్ అవడంతో ఎయిర్ పోర్టులో విమానాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ నుండి వచ్చే ప్రయాణికులు 14 రోజుల పాటు క్వారంటైన్ […]

Update: 2021-05-07 10:59 GMT

దిశ, రాజేంద్రనగర్ : కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో లాక్‌డౌన్, కర్ఫ్యూ ఉండటం కారణంగా శంషాబాద్ విమానాశ్రయం నుండి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన 30 విమానాలను ఎయిర్ పోర్టు అధికారులు రద్దు చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుండి ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వెళ్లాల్సిన దాదాపు 30 సర్వీసులు క్యాన్సిల్ అవడంతో ఎయిర్ పోర్టులో విమానాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ నుండి వచ్చే ప్రయాణికులు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించడంతో దేశరాజధానికి వెళ్లాల్సిన విమానాలతో పాటు, పుణె, చెన్నై, బెంగుళూరు వెళ్లాల్సిన సర్వీసులను కూడా రద్దు చేసినట్లు ఏర్పాటు ఎయిర్ పోర్టు అధికారులు ప్రకటించారు.

Tags:    

Similar News