తాత్కాలిక ఉద్యోగాలకు అమెజాన్ పిలుపు

by  |
తాత్కాలిక ఉద్యోగాలకు అమెజాన్ పిలుపు
X

దిశ, సెంట్రల్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు అవసరమైన సేవలను అందించడానికి ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా దాదాపు 20 వేల తాత్కాలిక ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ఆదివారం వెల్లడించింది. మొత్తం దేశవ్యాప్తంగా 11 నగరాల్లో ఈ ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్టు, పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నియామక అవసరాలను మేము నిరంతరం అంచనా వేస్తున్నామని, దేశీయంగానూ, ప్రపంచవ్యాప్తంగానూ సెలవు సీజన్‌లు ప్రారంభమవడంతో రానున్న ఆరు నెలల్లో కస్టమర్ ట్రాఫిక్ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు అమెజాన్ ఇండియా, వినియోగదారుల సేవా విభాగం డైరెక్టర్ అక్షయ్ ప్రభు వివరించారు. ఇందులో ఎక్కువ ఉద్యోగాలు వర్చువల్ కస్టమర్ సర్వీస్ ప్రోగ్రాంలో భాగంగా ఉంటాయని ఆయన చెప్పారు. ఆంగ్లంతో పాటు ప్రాంతీయ భాషల్లో ప్రావీణ్యం ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులని పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లలో ఇండియా మొత్తం 10 లక్షల ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యమని ఇటీవల అమెజాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ నియామకాలు చేపడుతున్నట్టు కంపెనీ తెలిపింది.

Next Story

Most Viewed