అమర్‌నాథ్ యాత్రికులకు మళ్లీ నిరాశే..

by  |
amarnath-temple
X

దిశ, వెబ్‌డెస్క్ : అమర్‌నాథ్ యాత్రను రద్దు చేస్తూ జమ్మూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అక్కడ కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తుండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, జూన్ 21 నుంచి యాత్ర ప్రారంభమై ఆగస్టు 3వ తేదీ వరకు కొనసాగాల్సి ఉంది.

ఒక్కసారి యాత్రికులను అనుమతిస్తే కరోనా కేసులు విజృంభించే అవకాశం ఉన్నందున చివరాఖరు నిమిషంలో యాత్రను రద్దు చేయాలని శ్రీ అమర్ నాథ్ దేవస్థాన బోర్డు సూచన మేరకు జమ్మూ ప్రభుత్వం యాత్రను నిలిపివేసింది. ఈనెల 18న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అమరనాథ్ శివ లింగాన్ని దర్శించుకున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి రాకతో ఈసారి ఆలయ దర్శనం తెరిచి ఉంటుందని భక్తులు భావించినా కరోనా వారి ఆశల మీద మరోసాని నీళ్లు చల్లినట్లు అయ్యింది.

Next Story

Most Viewed