బెంగళూర్ టూ అమెరికా విమాన సర్వీసులు… కెప్టెన్ లుగా మహిళలు

by  |
బెంగళూర్ టూ అమెరికా విమాన సర్వీసులు… కెప్టెన్ లుగా మహిళలు
X

దిశ,వెబ్‌డెస్క్ : శనివారం ప్రారంభం కానున్న బెంగళూరు – శాన్ ఫ్రాన్ సిస్కో విమాన సర్వీసుల్లో మొత్తం ఉమెన్ కాక్ పిట్ సిబ్బంది పనిచేస్తారని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. అట్లాంటిక్ మార్గంలో బెంగళూరు చేరుకోవడానికి ఎయిర్ ఇండియా విమానం ఉత్తర ధ్రువం మీదుగా వస్తుందని ఎయిర్ లైన్ సీనియర్ అధికారి తెలిపారు.
కెప్టెన్ జోయా అగర్వాల్- కెప్టెన్ తన్మై, కెప్టెన్ ఆకాన్షా సోనావేర్ – కెప్టెన్ శివానీ మన్హాస్లలు మహిళా కాక్‌పిట్ సిబ్బంది బెంగళూరు మరియు శాన్ ఫ్రాన్సిస్కో మధ్య చారిత్రాత్మక ప్రారంభ విమాన ప్రయాణ విధుల్ని నిర్వహిస్తున్నట్లు పూరి ట్విట్టర్‌లో తెలిపారు. శాన్ ఫ్రాన్సిస్కో మరియు బెంగళూరు మధ్య వైమానిక దూరం ప్రపంచంలోనే అతి పొడవైనది. మహిళల సారధ్యంలో ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు కొనసాగుతాయని పూరి చెప్పారు. ఇక ఈ విమానం AI176 శనివారం రాత్రి 8.30 గంటలకు (స్థానిక సమయం) అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుండి బయలుదేరుతుంది. సోమవారం తెల్లవారుజామున 3.45 గంటలకు (భారత కాలమాన ప్రకారం ) కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ కానుంది.

Next Story

Most Viewed