- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇండియాలో అడుగుపెట్టిన లేడీస్కాట్
దిశ, వెబ్‌డెస్క్: బాహుబలి సక్సెస్ తర్వాత జక్కన్న రూపొందిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్ఆర్’. ఇద్దరు పవర్ ప్యాక్డ్ హీరోలతో ఆయన అందించిన ఫస్ట్ లుక్స్, టీజర్స్.. ఇప్పటికే యావత్ సినీ అభిమానుల అంచనాలను మరింత పీక్స్‌కు తీసుకెళ్లాయనడంలో సందేహం లేదు. భారీ బడ్జెట్, స్టార్ కాస్టింగ్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ టాప్ స్టార్స్‌తో పాటు హాలీవుడ్ యాక్టర్స్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. మరి వాళ్లకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియదు కానీ, లాక్‌డౌన్ తర్వాత రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ‘ఆర్‌ఆర్ఆర్’ చిత్ర యూనిట్‌తో ఆయా నటీనటులు జాయిన్ అవుతున్నారు. ఈ క్రమంలోనే.. హాలీవుడ్ నటి అలిసన్ డూడీ ‘ఆర్‌ఆర్ఆర్’ టీమ్‌తో జాయిన్ అవ్వడానికి ఇండియా వచ్చేసింది.
హాలీవుడ్ నటీనటులు రే స్టీవెన్సన్, ఒలివియా మోరిస్, అలిసన్ డూడీలు ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అలిసన్ ప్రధానమైన ‘లేడీ స్కాట్’ పాత్రలో నటిస్తున్నారు. కాగా ప్రస్తుత షూటింగ్ షెడ్యూల్‌లో పాల్గొనేందుకు తను ఇండియా చేరుకుంది. ఈ మేరకు ఐర్లాండ్ నుంచి భారత్‌కు వస్తున్నట్లు అలిసన్ స్వయంగా తన ఇన్‌స్టాలో వెల్లడించింది. ‘లేడీ స్కాట్ ఇండియాకు వచ్చేస్తోంది’ అంటూ ఓ వీడియోను కూడా పంచుకుంది. మోడల్ నుంచి నటిగా మారిన ఈ 53 ఏళ్ల ఐరిష్ భామ.. పలు హాలీవుడ్ సినిమాలతో పాటు టీవీ సిరీసుల్లో నటించింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ద్వారా ఇండియన్ సినిమాకు పరిచయం అవుతున్నారు. ఒలివియా, స్టీవెన్సన్‌లు కూడా త్వరలోనే షూటింగ్‌లో జాయిన్ అవ్వబోతున్నట్లు సమాచారం.