భాగ్యనగరంలో ‘సీత’

by  |
భాగ్యనగరంలో ‘సీత’
X

దిశ, వెబ్‌డెస్క్ : దర్శకధీరుడు రాజమౌళి చెక్కుతున్న వెండితెర శిల్పం ‘ఆర్ఆర్ఆర్’లో అవకాశం అందుకున్నందుకు బాలీవుడ్ బ్యూటీ ఆలియా తెగ సంబరపడిన విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ వాయిదాపడటంతో ఆలియా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందనే వార్తలు కూడా వెలువడ్డాయి. అంతేకాదు ఇప్పటివరకు జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌లో ఆలియా పేరు ఎక్కడా వినిపించకపోవడంతో, ఆ గాసిప్స్ నిజమేనని అందరూ నమ్మారు. కానీ ఆ వార్తలకు చెక్ చెబుతూ ఆలియా ‘ఆర్ఆర్ఆర్’ కోసం వచ్చేసింది.

ఇటీవలే మహాబలేశ్వర్‌లో షూట్ కంప్లీట్ చేసుకుని వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ యూనిట్.. తాజా షెడ్యూల్‌లో కొన్ని కీలకమైన సీన్స్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరించనుంది. ఈ సీన్స్ ప్రధానంగా రాంచరణ్, ఆలియా మీద తెరకెక్కనున్నట్లు సమాచారం. అందుకోసమే ఆదివారం ముంబై నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ఆలియా.. ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్‌తో జాయిన్ అయ్యింది. ‘ఫైన‌ల్‌గా ఆర్ఆర్ఆర్ బృందం దారిలో’ అంటూ ఆలియా ఈరోజు (ఆదివారం) తన ఇన్‌స్టా స్టోరీ‌లో కామెంట్ పెట్టింది. కాగా స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజుని ప్రేమించే సీత పాత్రలో ఆలియా నటిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ జాగ‌ర్స్, బ్లాక్ గ్రా‌ఫిక్ టీ‌ష‌ర్టు, డెనిమ్ నియాన్ జాకెట్‌లో ముంబైలోని ఓ ప్రైవేట్ ఎయిర్ పోర్టులో అలియా కనిపించగా, అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్‌గా మారాయి.

Next Story