ఎయిర్‌టెల్ వినియోగుదారులకు షాక్.. ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలు పెంపు..

by  |
ఎయిర్‌టెల్ వినియోగుదారులకు షాక్.. ప్రీపెయిడ్ రీఛార్జ్ ధరలు పెంపు..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను సవరిస్తున్నట్టు బుధవారం వెల్లడించింది. తక్షణమే అమల్లోకి రానున్న ప్రీపెయిడ్ ఎంట్రీ లెవల్ ప్లాన్‌ల ధరలను ఏకంగా 60 శాతం వరకు పెంచింది. రూ. 49 ప్రీపెయిడ్ రీఛార్జ్‌ను ఆపేస్తున్నట్టు, బేసిక్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 79 నుంచి మొదలవనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. డబుల్ డేటాతో పాటు కస్టమర్లు నాలుగు రెట్లు ఎక్కువ ఔట్‌గోయింగ్ మినిట్స్ ఉపయోగించుకునే వీలు కల్పిస్తున్నట్టు పేర్కొంది. ‘నాణ్యమైన కనెక్టివిటీని అందించడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం.

ఎంట్రీ లెవెల్ ప్లాన్ రీఛార్జ్ చేసుకునే వినియోగదారులు తమ అకౌంట్ బ్యాలెన్స్ విషయమై చింతించకుండా ఎల్లప్పుడూ కనెక్ట్ అయ్యి ఉండొచ్చని’ ఎయిర్‌టెల్ వివరించింది. సవరించిన ప్రీపెయిడ్ ప్లాన్‌లు బుధవారం నుంచే అమలవుతాయని, అప్‌గ్రేడ్ చేసిన ప్లాన్ రూ. 79 ద్వారా రూ. 64 టాక్‌టైమ్‌తో పాటు 200 ఎంబీ డేటాను 28 రోజుల వ్యాలిడిటీతో పొందవచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది. కాగా, గత కొంతకాలంగా టెలికాం కంపెనీలు వినియోగదారుల నుంచి వచ్చే సగటు ఆదాయం (ఆర్పు) పెంచడంపై దృష్టి సారించాయి. ఇటీవలే ఎయిర్‌టెల్ తన పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లను అప్‌గ్రేడ్ చేసిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed