‘టీఆర్ఎస్ తొలగించిన ఉద్యోగాలే ఎక్కువ’

by  |
‘టీఆర్ఎస్ తొలగించిన ఉద్యోగాలే ఎక్కువ’
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ పాలనలో యువత, నిరుద్యోగులు ఎక్కువగా నష్టపోయారని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి విమర్శించారు. మంగళశారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… నిరుద్యోగుల త్యాగాన్ని పునాదిగా చేసుకొని, వాళ్లు పేర్చిన మెట్ల మీద ముఖ్యమంత్రి గద్దె ఎక్కిన కేసీఆర్, తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఉద్యోగ, ఉపాధి రంగాన్ని కేసీఆర్ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని.. నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేశారని అన్నారు. ప్రస్తుతం.. 50 వేల ఉద్యోగాలు, త్వరలో నిరుద్యోగ భృతి అంటూ మరోసారి మోసానికి పూనుకున్నారని వెల్లడించారు. ఓటమి భయంతో రాబోయే మండలి, కార్పొరేషన్, నాగార్జున సాగర్ ఎన్నికల లబ్ధి కోసం కేసీఆర్ మరోసారి యువతను మోసం చేసే కుట్ర చేస్తుందని తెలిపారు. కేసీఆర్ హయాంలో ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాల కన్నా.. తొలగించిన ఉద్యోగాలే ఎక్కువ అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రను యువత అర్థం చేసుకొని రానున్న ఎన్నికల్లో తిప్పికొట్టాలని సూచించారు. అంతేగాకుండా వివిధ శాఖల్లో 2లక్షలకు పైగా ఖాళీగా ఉన్న శాఖల్లో వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.



Next Story