సిలిండర్ ధర రూ. 5 వేలు.. అయినా ఆరు ఉచితంగా ఇస్తామన్న మంత్రి

by  |
Tamilnadu minister c.srinivasan
X

దిశ, వెబ్‌డెస్క్: మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ రేట్లు కూడా మండిపోతున్నాయి. ప్రస్తుతం సబ్సిడీ సిలిండర్ రూ. 900 కాగా, సబ్సిడీయేతర సిలిండర్ అయితే రూ. 1600 దాకా ఉంది. కాగా, తమిళనాడులో ఒక మంత్రి మాత్రం సిలిండర్ ధర రూ.5,000 ఉందని చెప్పారు. వాటి ధర ఎంత ఉన్నా తాము మాత్రం ఆరు సిలిండర్లను ఫ్రీగా ఇస్తామని సదరు మంత్రిగారు హామీ ఇవ్వడం గమనార్హం.

వివరాల్లోకెళ్తే.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అధికార పార్టీ ఏఐఏడీఎంకేకి చెందిన సీనియర్ నాయకుడు, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సి. శ్రీనివాసన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దిండిగల్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘మీకందరికీ తెలుసు. ప్రస్తుతం వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 4,800 నుంచి రూ. 5 వేల దాకా ఉంది. కానీ మేము ఒక కొత్త స్కీంను ప్రవేశపెడుతున్నాం. రాబోయే ఎన్నికల్లో మా పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఏడాదికి ఆరు సిలిండర్లను ఉచితంగా అందిస్తాం. దాంతో పాటు ప్రతి గృహిణికి నెలకు రూ. 1,500 ఆర్థిక సాయం కూడా అందిస్తాం..’ అని అన్నారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Next Story