కర్ణాటక తరహాలో సాగు : మంత్రి నిరంజ‌న్‌రెడ్డి

by  |
కర్ణాటక తరహాలో సాగు : మంత్రి నిరంజ‌న్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఉద్యాన పంట‌ల సాగు పెంచాలని, ఆధునిక ప‌ద్ధ‌తిలో ఉద్యాన పంట‌ల‌ను సాగు చేయాల‌ని వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి అన్నారు. క‌ర్ణాట‌క ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మంత్రి నిరంజ‌న్‌రెడ్డి శుక్ర‌వారం బెంగుళూరు సమీపంలోని వస్కోట్ దగ్గర తిరుమ్ శెట్టి హల్లిలో రైతు ఆనందరెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని సంద‌ర్శించారు. టమాటో, క్యాప్సికమ్, పాలకూర, ఆలుగడ్డ, క్యాబేజీ, కోళ్లు, గొర్రెలు, ఆవుల పెంపకాన్ని పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక ఉద్యాన పంటల సాగులో ముందుందని, కర్ణాటక రైతులను ఆదర్శంగా తీసుకుని తెలంగాణలోనూ ఆ ప్రణాళికలతో ముందుకెళ్తామ‌న్నారు. మూస పద్దతుల నుంచి రైతులను ఆధునిక సాగు వైపు మళ్లించి ఆదాయం పెంపొందించేలా చేస్తామ‌ని, ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులను మళ్లించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేన‌ని అన్నారు.



Next Story