సంతలో కాలేజీ విద్యార్థులు

by  |
santha1
X

దిశ, అశ్వారావుపేట టౌన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో బుధవారం నిర్వహించే సంతను వ్యవసాయ కళాశాల విద్యార్థుల బృందం సందర్శించింది. అశ్వారావుపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బీఎస్సీ మూడో సంవత్సరం విద్యనభ్యసిస్తున్న 50 మంది విద్యార్థులు మార్కెటింగ్ సబ్జెక్టులో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఐ. వి. కృష్ణ తేజ ఆధ్వర్యంలో వ్యాపార సముదాయాలలో లావాదేవీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ముందుగా ఖమ్మం రోడ్ లోని అరటి గెలల మార్కెట్ లో నిర్వహించే వేలం పాటలో పాల్గొని వ్యవసాయ క్షేత్రం నుంచి మార్కెట్ కు తరలించిన అరటిగెలల క్రయవిక్రయాల ప్రక్రియను రైతులు, వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భద్రాచలం రోడ్ లో బుధవారం సంత మార్కెట్ లో ఏర్పాటు చేసే తాత్కాలిక దుకాణాల వద్ద నిత్యావసర సరుకుల ధరల వివరాలు, వాటిని వినియోగదారులకు అమ్మే విధానాన్ని పరిశీలించారు. ఆ తర్వాత దుస్తులు, మాంసం దుకాణాల వద్ద కొనుగోలుదారుల నుంచి వివరాలు సేకరించారు. కోర్సులో భాగంగా క్షేత్ర స్థాయిలో పర్యటించిన ప్రతి విద్యార్థి మార్కెటింగ్ పై ఏర్పడిన అవగాహనను నివేదిక రూపంలో తయారు చేసి అధ్యాపకులకు సమర్పించాల్సి ఉంటుందని అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణ తేజ తెలిపారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉద్యోగాలు, మంచి వేతనం, అప్లై చేయండి.



Next Story

Most Viewed