రైతుల జీవితాలతో బీజేపీ, టీఆర్ఎస్ ఆటలు : దొంతి నరసింహారెడ్డి

by  |
Donthi Narasimha Reddy
X

దిశ ప్రతినిధి, వరంగల్: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయకుండా ప్రభుత్వాలు డ్రామాలు చేస్తూ, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ప్రముఖ వ్యవసాయ రంగ విశ్లేషకులు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం హన్మకొండ హంటర్ రోడ్డులోని మాజీ మంత్రి తక్కెళ్ళపల్లి పురుషోత్తమరావు నివాసంలో తెలంగాణ జనవేదిక ఆధ్వర్యంలో 415వ ఆన్లైన్ జూమ్ సదస్సు జరిగింది. తెలంగాణ జనవేదిక వ్యవస్థాపక కన్వీనర్ తక్కళ్ళపల్లి రాము నేతృత్వంలో ‘‘ధాన్యం రాజకీయ వస్తువా లేదా ఆహారమా’’ అనే అంశంపై దొంతి నరసింహారెడ్డి హాజరై కీలక ప్రసంగం చేశారు. 1995 డబ్ల్యూటీఓ అగ్రిమెంట్‌ సరళీకృత ఆర్థిక విధానాల పర్యావసనమే ధాన్యం కొనుగోలు విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రతి గింజనూ కొంటామని ప్రగల్బాలు పలికారని విమర్శించారు.

ధాన్యం సేకరణలో భవిష్యత్‌లో తలెత్తే పరిణామాలను తన మీదకు రాకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై పోరాడుతున్నారని చెప్పారు. జాతీయ ఆహార భద్రత చట్టం.. ప్రజలందరికీ వర్తింస్తోందని తలకు 5 కిలోలు చొప్పున బియ్యం అందచేస్తోందని చెప్పారు. పంజాబ్, యూపీ, ఇతర రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసిందని చెప్పారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లోనూ ధాన్యం ఉత్పత్తి పెరిగిందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఇబ్బంది రాకుండా కేంద్ర, రాష్ట్రాలు సరైన విధి విధానాలను రూపొందించాలని కోరారు. తెలంగాణ జనవేదిక వ్యవస్థాపక కన్వీనర్ తక్కెళ్ళపల్లి రాము మాట్లాడుతూ.. 58 శాతం గ్రామీణ కుటుంబాలన్నాయి. పాలకులకు నిర్ధిష్టమైన ప్రణాళిక లేదు. 2014 తర్వాత వ్యవసాయదారులపై దాడులు జరుగుతున్నాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని గందరగోళంలోకి నెట్టాయని తెలిపారు. ఈ సదస్సులో డాక్టర్ ఆకుతోట శ్రీనివాసులు, డాక్టర్ కొట్టే భాస్కర్, డాక్టర్ లక్ష్మీప్రసాద్, జేమ్స్ ప్రశాంత్, బజార్ రంగారావు డాక్టర్ కె.మల్లేశం, డాక్టర్ ఎడ్ల ప్రభాకర్, ప్రొఫెసర్ కందకట్ల సుధాకర్, డాక్టర్ బైశెట్టి కవిత, గోవింద్ రాకేశ్, అబిదుల్లా, మహేశ్ రెడ్డి, నెలకుర్తి రవీందర్రెడ్డి, ప్రదీప్, రాములు, సోమ రామ్మూర్తి, వి.సురేశ్, స్వాతిమిశ్రా, ఉష, వి.సురేశ్, డాక్టర్ సోమరాతి భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed