ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక ఆకర్షణగా అగ్మెంటివ్ రియాలిటీ షో

by  |
Vijayawada
X

దిశ, ఏపీ బ్యూరో: దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా దేవాదాయశాఖ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పటికే హెలీ టూరిజం దసరా ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణానదిపై నుంచి విహరిస్తూ నది అందాలతో పాటు మబ్బుల చాటు నుంచి ఇంద్రకీలాద్రి వైభవం, విజయవాడ నగర సోయగాల్ని వీక్షించేలా ప్రాజెక్టు రూపొందించారు. దీనికోసం తుంబై ఏవియేషన్ సంస్థ ఆరుగురు ప్రయాణీకులు ఒకేసారి ప్రయాణించేలా సింగిల్ ఇంజన్ ఛాపర్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా మరో ప్రత్యేక ఆకర్షణగా అగ్మెంటివ్ రియాలిటీ షో నిలవనుంది. యువతకు అమ్మవారి చరిత్ర తెలియజేసేందుకు భక్తుల ముందుకు దుర్గగుడి అధికారులు సరికొత్త టెక్నాలజీని తీసుకు రాబోతున్నారు. ఇంద్రకీలాద్రిపై ఘాట్ రోడ్డు, చినరాజగోపురం, మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం వద్ద చరిత్ర చెప్పే క్యూఆర్ బోర్డుల ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ఈనెల 12న ప్రారంభించనున్నారు. ‘Kanakadurga ar’ అనే యాప్ డౌన్ లోడ్ చేసి బోర్డుపై పెడితే అమ్మవారి పూర్తి చరిత్రను వీడియో ద్వారా చూసే అవకాశం లభిస్తుందని దుర్గగుడి పాలకమండలి వెల్లడించింది.



Next Story

Most Viewed