మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌లో అడ్మిషన్లు ప్రారంభం

by  |
మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్‌లో అడ్మిషన్లు ప్రారంభం
X

దిశ, పటాన్ చెరు: తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల పటాన్ చెరులో 2021-2022 విద్యా సంవత్సరానికి గాను ఐదో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. 5వ తరగతిలో 80 సీట్లకుగాను 60 సీట్లు మైనార్టీలకు, 10 సీట్లు బిసీలకు, ఐదు ఎస్సీలకు, మూడు ఎస్టీలకు, ఓసీలకు రెండు సీట్లు కేటాయించినట్లు చెప్పారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో 40 సీట్లు, బైపీసీ విభాగంలో 40 సీట్లకు గాను.. 30 సీట్లు మైనార్టీలకు, పది సీట్లు నాన్ మైనార్టీలకు, ఐదు సీట్లు బీసీలకు, రెండు సీట్లు ఎస్సీలకు, రెండు ఎస్టీలకు, ఒక సీటు ఎస్సీలకు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విశాలమైన భవనంలో ఉత్తమ ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజా ప్రతినిధులు అందరూ తమ తమ పరిధిలో గల అర్హులైన విద్యార్థులను చేర్పించేలా కృషి చేయాలని ఆయన కోరారు.


Next Story

Most Viewed