ఇఫ్తార్ విందులు ఇండ్లలోనే చేసుకోవాలి: కలెక్టర్ ముషారఫ్

by  |
ఇఫ్తార్ విందులు ఇండ్లలోనే చేసుకోవాలి: కలెక్టర్ ముషారఫ్
X

దిశ, ఆదిలాబాద్: రంజాన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముస్లింలు సహార్, ఇఫ్తార్ సహా నమాజ్‌లను ఇంట్లోనే జరుపుకోవాలని కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అన్నారు. కలెక్టర్ సమావేశ మందిరంలో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ కమిషనర్లు, ముస్లిం మతపెద్దలతో కలిసి రంజాన్ ఏర్పాట్లపై చర్చించారు. కరోనాను అడ్డుకునేందుకు ప్రభుత్వం మే 7 వరకు లాక్ డౌన్ విధించిందని, ఈ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఇంటికే నిత్యావసర సరుకులు పంపిస్తున్నట్టు తెలిపారు. గత 12 రోజులుగా జిల్లాలో ఒక పాజిటివ్ కేసులు కూడా నమోదు కాలేదన్నారు. ప్రభుత్వం అందించే సూచనలు పాటిస్తూ సహకరించాలని కోరారు. ఎస్పీ శశిధర్ రాజు మాట్లాడుతూ ప్రజల సహకారంతో లాక్‌డౌన్ కఠినంగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఇప్పుడున్న స్థితి ఇలాగే కొనసాగించేందుకు సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో నిర్మల్, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, అంకం రాజేందర్, భైంసా మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ అహ్మద్, అదనపు జిల్లా కలెక్టర్ ఏ భాస్కర్ రావు పాల్గొన్నారు.

Tags: Adilabad, collector, Meeting, Ramazan, Arrangement



Next Story

Most Viewed