ట్రాక్టర్ ఎక్కిన అడిషనల్ కలెక్టర్.. వ్యాక్సిన్ పై వారికి భరోసానిచ్చి!

131

దిశ, జన్నారం : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జన్నారం గ్రామపంచాయతీ పరిధిలోని మారుమూల గ్రామానికి బుధవారం మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులతో కలిసి వెళ్లారు. జన్నారం గోండుగూడ మధ్య ఉన్నటువంటి వద్ద వాగు ప్రవహిస్తుండటంతో ట్రాక్టర్ ఎక్కి వాగు క్రాస్ చేశారు. ఆ తర్వాత కాలినడకన గ్రామానికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడారు. కరోనా వ్యాక్సిన్‌పై అక్కడి ప్రజలకు అవగాహన కల్పించారు.

వ్యాక్సిన్ అందరూ వేయించుకోవాలని, ఈ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట మండల స్పెషల్ అధికారి శంకర్, డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్, ఎంపీడీవో రమేష్, సర్పంచ్ గంగాధర్ గౌడ్, ఎంపీటీసీ రియాజుద్దీన్లు ఉన్నారు.