డీజేకు అనుమతి లేదు.. మండపాల అనుమతి తప్పనిసరి

by  |
ACP Uday Reddy
X

దిశ, భువనగిరి రూరల్: వినాయక చవితి పండుగ సమీపిస్తోన్న తరుణంలో విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్ రెడ్డి సూచించారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాగారం గ్రామంలో రామన్నపేట సీఐ మోతీరామ్ ఆధ్వర్యంలో ‘నేనుసైతం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏసీపీ మాట్లాడుతూ… గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని సూచించారు. అదేవిధంగా నిమజ్జన ఊరేగింపులో డీజేకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

అనుమతి లేకుండా ఎవరైనా డీజేలతో ఊరేగింపులు చేస్తే నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతీ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు స్థానిక ప్రజాప్రతినిధులు, దాతలు సహకరించాలని కోరారు. ‘మై విలేజ్.. సేఫ్ విలేజ్’ అనే నినాదంతో పని చేయాలన్నారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏసీపీ, సీఐలను ప్రజాప్రతినిధులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వాకిటి పద్మ అనంతరెడ్డి, ఎంపీపీ నూతి రమేష్, ఎస్ఐ రాఘవేందర్ గౌడ్, ఎంపీటీసీలు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, వ్యాపారస్తులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed