జూలు విదిల్చిన చరణ్.. యుద్ధం మొదలెట్టిన సిద్ధుడు!

by  |

దిశ, సినిమా : కొరటాల శివ డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్(సిద్ధ) సైతం కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి ఆచార్యగా కనిపించనున్న సినిమా టీజర్ ఇటీవలే విడుదలై అందరి మనసులు గెలుచుకుంది.

తాజాగా రామ్ చరణ్ క్యారెక్టర్‌ను రివీల్ చేస్తూ మరో టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఈ మేరకు మొదట దైవ భక్తునిగా, ఆ తర్వాత నక్సలైట్‌గా కనిపించిన చరణ్.. మూవీ పై అంచనాలు అమాంతం పెంచేశాడు. కాగా సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతకాలపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ‘ఆచార్య’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల కానుంది.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story