ఆసియా కప్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!

by  |
Asia cup
X

దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్ 2021ని రెండేళ్ల పాటు వాయిదా వేస్తూ ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నది. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది జరగాల్సిన ఆసియా కప్‌ను ఈ ఏడాదికి వాయిదా వేశారు. అయితే కరోనా తగ్గుముఖం పట్టనందున ఆసియా కప్ నిర్వహించలేమని శ్రీలంక క్రికెట్ బోర్డు తేల్చి చెప్పింది. మరోవైపు ఈ ఏడాది బిజీ షెడ్యూల్ కారణంగా ఆసియా కప్‌కు తగిన విండో కూడా దొరకడం లేదు. దీంతో ఆసియా కప్‌ను రెండేళ్ల పాటు వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం 2022లో ఒక ఆసియా కప్ నిర్వహించాల్సి ఉండటంతో 2021 ఆసియా కప్‌ను 2023కి వాయిదా వేశారు. ‘కొవిడ్-19 కారణంగా పలు ఆంక్షలు అమలులో ఉన్నాయి. అలాగే ఆటగాళ్లు, సిబ్బంది, అధికారుల భద్రత కూడా ముఖ్యమే. అందుకే 2020 ఆసియా కప్‌ను 2021కి మార్చాము. అయితే ఈ ఏడాది కూడా ఆసియా కప్ నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. వచ్చే ఏడాది మరో ఆసియా కప్ ఉండటం వల్ల.. ఈ ఏడాది నిర్వహించాల్సిన ఆసియా కప్‌ను 2023కు వాయిదా వేస్తున్నాము’ అని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. 2022లో పాకిస్తాన్, 2023లో శ్రీలంక ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

Next Story

Most Viewed