ఏసీసీ లిమిటెడ్ తొలి త్రైమాసికంలో 40 శాతం వృద్ధి

by  |
ఏసీసీ లిమిటెడ్ తొలి త్రైమాసికంలో 40 శాతం వృద్ధి
X

దిశ, వెబ్‌డెస్క్: సిమెంట్ తయారీ సంస్థ ఏసీసీ లిమిటెడ్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 40 శాతం క్షీణించి రూ. 270.95 కోట్లుగా నమోదైనట్టు కంపెనీ వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 455 కోట్లుగా నమోదైంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా నిర్మాణ రంగం దెబ్బ తినడంతో లాభాలు తగ్గాయని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఇక, మొత్తం అమ్మకాలు 38 శాతం పెరిగి రూ. 2,520 కోట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 4,059.28 కోట్లు. మార్చి త్రైమాసికంలో అమ్మకాల విలువ రూ. 3,433 కోట్లని కంపెనీ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం ఏడాది ప్రాతిపదికన 37 శాతం తగ్గి రూ. 2,602.24 కోట్లుగా నమోదైంది. అలాగే, తొలి త్రైమాసికంలో కంపెనీ స్వతంత్ర ఆదాయం 37.31 శాతం తగ్గి రూ. 2,600.83 కోట్లకు చేరుకుంది. జూన్ త్రైమాసికంలో ఏసీసీ సిమెంట్ వ్యాపార ఆదాయం 33 శాతం పెరిగి రూ. 2,550 కోట్లకు పెరగ్గా, రెడీ మిక్స్ కాంక్రీట్ ఆదాయం 83 శాతం తగ్గి రూ. 62 కోట్లకు చేరుకుందని కంపెనీ పేర్కొంది. కాగా, కంపెనీ మొత్తం ఖర్చులు జూన్ త్రైమాసికంలో 36 శాతం తగ్గి రూ. 2,252 కోట్లకు చేరుకున్నాయి.

Next Story

Most Viewed