సెక్స్ వద్దనుకునే వారి కోసం సరికొత్త డేటింగ్ యాప్

by  |
సెక్స్ వద్దనుకునే వారి కోసం సరికొత్త డేటింగ్ యాప్
X

దిశ, ఫీచర్స్ : చాలా మందికి సెక్స్ అంటే ఇష్టముండదు. అందుకే అలాంటి వారికి డేటింగ్ యాప్స్‌లో సరైన ప్రాతినిథ్యం లభించడం లేదు. శృంగారం పట్ల అయిష్టత కలిగిన ఒక యూఎస్ మహిళ కూడా ఇదే విషయాన్ని గుర్తించింది. దీంతో ‘నో సెక్స్’ కాన్సెప్ట్‌ ఆధారంగా ప్రముఖ డేటింగ్ యాప్స్ ‘టిండర్, బంబుల్‌’కు పోటీగా ‘ది సెక్స్‌లెస్ ట్రైబ్’ అనే యాప్‌ను సృష్టించింది. సాధారణంగా సెక్సువల్ అట్రాక్షన్ లేకపోవడాన్ని అలైంగికతగా పరిగణిస్తుంటారు. బిజినెస్ ఉమన్ సీబ్రూక్ రూపొందించిన ‘నో-సెక్స్’ డేటింగ్ యాప్.. లైంగికతతో కాకుండా క్రిస్టియన్ కాన్సెప్ట్ ప్రకారం వివాహం తర్వాతే సెక్స్‌ వైపు ప్రజలను ప్రోత్సహిస్తుంది.

33 ఏళ్ల సీబ్రూక్.. గతేడాది తనకు దేవుడి నుంచి పిలుపు అందిన తర్వాత ఈ యాప్‌ను సృష్టించినట్లు పేర్కొంది. ఆమె 13 ఏళ్ల వయసులోనే సెక్స్ పట్ల నిగ్రహం(abstinence) పాటించే మార్గాన్ని ఎంచుకుంది. కాగా సెక్స్‌లెస్ ట్రైబ్.. సాధారణ డేటింగ్ యాప్ మాత్రమే కాదని, శృంగారం విషయంలో నిగ్రహాన్ని పాటించే వ్యక్తులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని తెలిపింది. ఈ యాప్‌లో ప్రస్తుతం 8,000 మంది సబ్‌స్క్రైబర్స్ ఉండగా.. సెక్స్‌లో పాల్గొనని నెటిజన్ల కమ్యూనిటీ క్రమంగా పెరుగుతుండటంతో దీన్ని పూర్తిస్థాయిలో కొనసాగించాలని సీబ్రూక్ నిర్ణయించుకుంది.

సెక్స్‌లెస్ ట్రైబ్ ఆఫర్..

సెక్స్‌లెస్ ట్రైబ్‌లో రెండు రకాల సెటప్స్ రూపొందించబడ్డాయి. నిగ్రహం పాటించేందుకు అవసరమైన అంశాల గురించిన సమాచారమందించే సెటప్ ఒకటైతే.. టిండర్ స్టైల్‌లో కమ్యూనిటీ మెంబర్స్ సొంత అకౌంట్స్ క్రియేట్ చేసుకుని, యాప్‌లోని ఇతర సభ్యులతో ఇంటరాక్ట్ కావడం మరొకటి. ఇక యూజర్లు ప్రతిరోజూ తమ నిగ్రహాన్ని నిలుపుకునేందుకు వీలుగా ఎంకరేజింగ్ కోట్‌ను పొందుతారు. ప్రతి నెలా యాప్.. కమ్యూనిటీ కోసం జూమ్ మీటింగ్స్ కూడా నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్ ‘బీటా’ మోడ్‌లో ఉండగా.. ఇది ‘క్రిస్టియన్ యాప్’ కాదని, నిగ్రహపూరిత జీవనశైలిని కోరుకునే ఎవరికైనా సరైన వేదిక అని సీబ్రూక్ వెల్లడించింది.

Eesha Rebba: అదిరిపోయే అందాలకు అబ్బా అని తీరాల్సిందే..



Next Story