ప్రజల కోసం పనిచేయండి : కర్ణాటక మాజీ సీఎం

by  |
ప్రజల కోసం పనిచేయండి : కర్ణాటక మాజీ సీఎం
X

మీరిక్కడ ఉన్నది కొన్ని సంస్థలను మెప్పించేందుకు కాదు, ఆరు కోట్ల మంది ప్రజల కోసం పనిచేసేందుకని కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి మఖ్యమంత్రి యడ్యూరప్పను ఉద్దేశించి అన్నారు. బుధవారం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించే క్రమంలో కుమారస్వామి ‘యాంటీ సీఏఏ పద్యాన్ని’ చదివి వినిపించారు. కాగా ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి అల్లర్లకు కారణమవుతున్నారనే నెపంతో ఈ పద్యాన్ని రాసిన సిరాజ్ బిసరల్లితో పాటు సామాజిక మాధ్యమాల్లో వీడియోను షేర్ చేసిన పాత్రికేయుడు రాజబక్సిని కూడా అరెస్టు చేశారు. కన్నడలో రాసిన ఈ పద్యం ఇప్పటికే 13 భాషల్లోకి అనువదించబడింది.

Next Story

Most Viewed