జగన్‌కు షాక్.. ఏబీ సస్పెన్షన్ ఎత్తివేత

by  |
జగన్‌కు షాక్.. ఏబీ సస్పెన్షన్ ఎత్తివేత
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. సెక్యూరిటీ పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారంటూ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును కొన్ని నెలల కిందట ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తన సస్పెన్షన్ చెల్లదంటూ ఆయన క్యాట్‌ను ఆశ్రయించగా, స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం.. ఆయన సస్పెన్షన్ చెల్లదని తీర్పునిచ్చింది. అంతే కాకుండా ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సస్పెన్షన్ కాలంలో నిలిపేసిన వేతన బకాయిలు కూడా చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో మూడోసారి చుక్కెదురైంది.

తొలుత పంచాయతీ రంగుల విషయంలో ఏపీ నిర్ణయాన్ని తప్పుపడుతూ, కోర్టు ధిక్కార నేరంపై సుమోటోగా కేసు నమోదు చేసింది. రెండో సారి వైజాగ్ డాక్టర్ సుధాకర్ కేసులో తీర్పు వెలువరుస్తూ, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు కేసులో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది.

Next Story

Most Viewed