తూఫ్రాన్‌లో ‘ఆలన వైద్య సేవలు’

by  |
తూఫ్రాన్‌లో ‘ఆలన వైద్య సేవలు’
X

దిశ, మెదక్: ఇంట్లో మంచానికే పరిమితమై.. చికిత్స పొందేందుకు ఇబ్బంది పడుతున్న దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు ఇంటి వద్దే వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం ఆలన ( తెలంగాణ ప్యాలియేటివ్ హోంకేర్ ) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మెదక్ జిల్లాలో ప్రథమంగా తూప్రాన్ డివిజన్ కేంద్రంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ DMHO అరుణశ్రీ, సామాజిక దవాఖాన డాక్టర్ అమర్ సింగ్, పీహెచ్ సీ డాక్టర్లు ఆనంద్, భావనతో కలిసి జెండా ఊపి ఆలనా సేవలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగి, వెల్దుర్తితో పాటు శివ్వంపేట మండలాలకు ఈ వాహనంలో వెళ్లి వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. అయితే వ్యాధిగ్రస్తుల వివరాల సమాచారం ముందే సేకరించి, 15 రోజుల కొకసారి వారి వద్దకు వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన మందులు అందజేస్తామన్నారు. ఈ మండలాల్లో ఇప్పటివరకు 250 మంది రోగులను గుర్తించినట్లు చెప్పారు. ఇకమీదట గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు నాణ్యమైన వైద్యం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే జిల్లాలో మరో 3 ఆలనా వాహనాలు అవసరమున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మెదక్ -2, నర్సాపూర్ -1 త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సీహెచ్‌వో బాల నర్సయ్య, పీహెచ్ఎన్ సంపతి, సామాజిక, పీహెచ్‌సీ దవాఖాన వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Next Story

Most Viewed