- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్లీజ్ ఒక్కసారి సెక్స్ చేయి.. నడి రోడ్డుపై యువకుడి అఘాయిత్యం
దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో ఎన్ని మారినా మహిళలపై మృగాళ్ల అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. మహిళల సేఫ్టీ కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఏదో ఒక చోట మృగాళ్ల వేధింపులకు మహిళలలు బలవుతూనే ఉన్నారు. ప్రేమిస్తున్నానంటూ వెంటపడడం, ఒప్పుకోకపోతే చంపేయడం, యాసిడ్ పోయడం లాంటివి రోజూ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ఒక యువతిని సెక్స్ కి ఒప్పుకోలేదని నడిరోడ్డుపై చితకబాదాడు ఓ యువకుడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే..
మొరాదాబాద్ కి చెందిన ఒక యువతిని గతకొంతకాలంగా ఓ యువకుడు ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నారు. ఆమె నాకిష్టం లేదన్న వినకుండా రోజు ఆమె ఇంటివద్ద కాపుకాసి ఆమెను వేధింపులకు గురిచేస్తూ ఉండేవాడు. ఈ బాధను తట్టుకోలేని యువతి, యువకుడిని తీవ్రంగా హెచ్చరించింది. ఇంకోసారి ప్రేమ అని వెంటపడితే మా ఇంట్లో చెప్తానని తెలిపింది. దీంతో యువకుడు ప్రేమ వద్దు కనీసం సెక్స్ కైనా ఒప్పుకో అంటూ మళ్లీ వెంటపడడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం యువతి ఇంటికి వెళ్తుంటే మార్గమధ్యంలో యువకుడు ఆమెను ఆపి సెక్స్ కి ఒప్పుకోమని బలవంతపెట్టాడు. ఆమె ససేమిరా అని చెప్పడంతో స్కూటీ దిగి… ఆమెను చితకబాదాడు. ఆమె తలను గోడకేసి కొట్టి రెండు చెంపలూ వాయించేశాడు. కాలితో పొట్టలో తన్ని, జుట్టు పట్టుకొని నేలపై విసిరికొట్టాడు. అంతేకాకుండా నేలపై పడి.. విలవిలలాడుతున్న ఆమెను కాళ్లతో మళ్లీ మళ్లీ తన్ని తన కోపాన్ని ప్రదర్శించాడు. ఆమె కింద పడి గిలగిలా కొట్టుకొని అరుస్తుండడంతో.. అక్కడినుండి పరారయ్యాడు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.
యువతిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఈ విషయాన్ని పట్టించుకోనట్టు డ్రామా ఆడారు. చివరికి ఈ సీసీ టీవీ ఫుటేజ్ నెట్టింట్లో వైరల్ కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యి యువకుడిని స్కూటీ నెంబర్ ఆధారంగా పట్టుకొని అరెస్ట్ చేశారు.