మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో ట్విస్ట్ !

by  |
మాజీ తహసీల్దార్ నాగరాజు కేసులో ట్విస్ట్ !
X

దిశ, తెలంగాణ క్రైమ్​‌బ్యూరో: చంచల్​గూడ జైలులో ఆత్మహత్య చేసుకున్న రిమాండ్​ ఖైదీ మాజీ తహసీల్దార్​ కేసులో సరికొత్త ట్విస్ట్​ నడుస్తోంది. నాగరాజు బినామీగా గుర్తించిన బొల్లారానికి చెందిన నందగోపాల్​ నివాసంలో ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం సోదాలు నిర్వహించారు. ఆగస్టు 14న రియల్టర్ల నుంచి రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ కీసర తహసీల్దార్​ నాగరాజు ఏసీబీ అధికారులకు రెడ్​ హ్యాండెడ్​ గా పట్టుబడిన సంగతి తెల్సిందే. ఈ కేసులో నాగరాజుతో పాటు వీఆర్​ఏ సాయి, రియల్టర్​ శ్రీనాథ్​, ఏజెంట్​ అంజిరెడ్డిలను అరెస్టు చేశారు. ఇదే సమయంలో కీసర మండలం రాంపల్లి గ్రామంలో ధర్మారెడ్డి కుటుంబ సభ్యులకు మరో 26 ఎకరాల భూమి పాస్​‌బుక్​‌లు ఇచ్చేందుకు ప్రాసెస్​ సిద్దం చేశాడనే ఆరోపణలతో నాగరాజుపై ఏసీబీ అధికారులు మరో కేసు నమోదు చేశారు. వీటిలో మొదటి కేసు కస్టడీ విచారణ పూర్తికాగా, రెండో కేసులో నాగరాజు మరణించే నాటికి కస్టడీ కొనసాగుతోంది.



Next Story

Most Viewed