ఆయన చెప్పనిదే ఫైల్ కదలదు.. పనికాదు

by  |
ఆయన చెప్పనిదే ఫైల్ కదలదు.. పనికాదు
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: మణికొండ మున్సిపాలిటీలో ఓ సెంకడ్ గ్రేడ్ అధికారి చక్రం తిప్పుతున్నాడు. ఇక్కడ అ అధికారే చెప్పిందే వేదం. ప్రజాప్రతినిధులున్నా.. ఉన్నతాధికారులు కొలువుదీరినా ఆయన ప్పినదే శాసనం. ఆసారు ఊ అంటేనే ఫైళ్లు కదులుతుంది.. పని అవుతుంది. ఆ పని అక్రమమైనా… సక్రమమైనా సరే. ఆ అధికారి ప్రమేయం లేకపోతే అనుమతులు రావడం కష్టమే. మున్సిపాలిటీ చైర్మన్, కమిషనర్ లైనా అధికారికి సరెండర్ కావాల్సిందేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతాడు.. అంతేకాదు ఆయనను సంప్రదిస్తే అక్రమ నిర్మాణదారులకు సలహాలు సూచనలు చేస్తారు. మణికొండలో జరిగే ప్రతీ కట్టడం వెనుక ఆ అధికారి ప్రమేయం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నది.

హైదరాబాద్ శివారు, మణికొండ మున్సిపాలిటీ పరిధిలో అత్యంత సంపన్నులు, వ్యాపార, రాజకీయ నాయకులు ఎక్కువగా నివాసం ఉంటారు. పేదలు, మధ్య తరగతి కుటుంబాలు అధికంగానే ఉంటాయి. ఇలాంటి ప్రాంతంలో ప్రజా పరిపాలన సక్రమంగా జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అన్నింటికి విరుద్ధంగా విచిత్రమైన పాలనతో ఆ మున్సిపాలిటీలో పనిచేసే ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఆ అధికారి చేసే చిత్రహింసలు, వేధింపులు, అవమానాలు ఎదుర్కొని మనస్సులో దిగమింగుకుంటున్నారు. విషయాలను బహిర్గతం చేస్తే ఉద్యోగం ఉండదని ఆ అధికారి బెదిరింపులతో సతమతమవుతున్నారు.

ఆయన ప్రమేయం లేకుంటే ఉత్తదే..

మణికొండ మున్సిపాలిటీలో ఏపని కావాలన్న ఆయనును కలవాల్సిందే. లేకపోతే ఆ పని ముందుకు సాగదు. ఆ పని అక్రమమైనా… సక్రమమైనా సరే. ఆ అధికారి ప్రమేయం లేకపోతే అనుమతులు రావడం కష్టమంటూ ప్రచారం సాగుతుంది. మున్సిపాలిటీ చైర్మన్, కమిషనర్ లైనా ఆ అధికారికే సరేండర్ కావాల్సిందేనట. అంతేకాకుండా అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతారని తెలుస్తోంది. అతనిని సంప్ర దించే అక్రమ నిర్మాణదారులకు సలహాలు సూచనలు చేస్తారు. త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి రంగులు వేస్తే కూల్చివేసే అర్హతలు లేవని చేబుతారు. మణికొండలో జరిగే ప్రతి అక్రమ కట్టడం వెనుక ఆ అధికారి ప్రమేయం ఉన్నట్లు సమాచారం. మాట వినని అధికారులను, సిబ్బందిన మార్చేందుకు ప్రణాళికలు చేస్తారని తెలుస్తోంది.

వెనకున్నది ఎవరు..?

ఓ సెంకడ్ గ్రేడ్ అధికారి మున్సిపాలిటీ పాలనలో హవా సాగిస్తున్నాడు. ఆయన స్థాయి కేవలం పర్యవేక్షణాధికారి. శానిటేషన్ ఉద్యోగుల విధులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం. అవసరమైన నాల్గవ తరగతి ఉద్యోగులను నిమమించుకోవడం, తొలగించడం ఆ అధికారి విధి. అలాంటి మేనేజర్ ఆ కార్యాలయంలో పనిచేసే ప్రతి ఉద్యోగిని తమ చెప్పుచేతుల్లోకి తీసుకోవడం విడ్డూరంగా ఉంది. ఈయన ఇంతా సాగించేందుకు అసలు వ్యక్తులు ఎవరని ఆరా తీస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ పదవిని కైవసం చేసుకున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ నాయకుల అండదండలున్నాయా అంటే లేవనే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అభివృద్ధి ఆగిపోతుందనే భయంతో ఆ అధికారి ఏవిధంగా చేబితే ఆవిధంగా తలలు ఊపి పనిచేసుకపోతున్నారంటా. ఇంకేవ్వరు ఇతని వెనుకలాంటే చైర్మన్, వైస్ చైర్మన్లపై స్థానిక ప్రజలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ వీరిద్ధరూ సౌమ్యులు, అందరి తో కలిసి మెలిసి ఉంటారని స్థానికులు వివరిస్తున్నారు. మరీ ఆ అధికారి ఎవరున్నారనే విషయం చెప్పేందుకే జంకుతున్నారు. ఇలాంటి అధికారిపై వేటు వేయకుండా కమిషనర్, చైర్మన్లు ఎందుకు నిరీక్షిస్తున్నారనే వాదన వినిపిస్తుంది. ఈ ఇద్దరి సంతాకాలను ఫోర్జరీ చేసినా పట్టించుకోవడం లేదని వినిపిస్తోంది. ఆ అధికారిపై అంతర్గత విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇక్కడి నిర్మాణాల వెనుక ఆయనే…

ఈ మున్సిపాలిటీ హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నప్పటికీ గతంలో గ్రామ పంచాయతీ అనుమతులతోనే లే ఔట్లు చేశారు. వీటిల్లో ప్లాట్లు కొను గోలు చేసినప్పటికీ నిర్మాణ చేపడితే తప్పనిసరి ఎల్ఆర్ఎస్, మున్సిపాలిటీ అనుమతులు పొందాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం అనుమతులు పొందితే ప్రభుత్వానికి, మున్సిపాలిటీకి అధికంగా ఆదాయం వస్తోంది. కానీ మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొడుతూ ఆ అధికారి ముందుండి అక్రమ వెంచర్లకు, అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారు. ఈ అనుమతులు ఇస్తున్నందుకు ఓ ప్రజాప్రతినిధికి, ఓ ఉన్నత స్థాయి అధికారికి వసూలు చేసి ఇస్తున్నట్లు సమాచారం. అంతేకాదు… టౌన్ ప్లానింగ్ అధికారి చెప్పినట్లు వినడం లేదని ఉన్నతాధికారికి వివరించి సస్పెండ్ చేయించినట్లు సమాచారం. ఈ అధికారి ఆగడాలతో అమాయకమైన అధికారులు, సిబ్బంది పై వేటు పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed