రాజును చేయాలనే లక్ష్యంతోనే… : ఎమ్మెల్యే మెతుకు

by Sridhar Babu |   ( Updated:2020-05-26 03:09:54.0  )
రాజును చేయాలనే లక్ష్యంతోనే… : ఎమ్మెల్యే మెతుకు
X

దిశ, రంగారెడ్డి: ప్రతి రైతునూ ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. వికారాబాద్ లోని కొంపల్లిలో వానకాలం-2020 వ్యవసాయ కార్యాచరణ నియంత్రిత వ్యవసాయ విధానంపై గ్రామస్థాయిలో రైతులకు ఎమ్మెల్యే ఆనంద్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ.. వ్యవసాయానికి కరెంటు, విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి సాయం కేవలం తెలంగాణా రాష్ట్రంలోనే రైతులకు అందుతున్నాయని అన్నారు. రైతును రాజును చేయాలనే లక్ష్యంతోనే వ్యవసాయ రంగంలో అనేక మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం విప్లవాత్మకమైన చర్యలు చేపడుతుందని చెప్పారు. గ్రామంలోని రైతులు అందరూ ఒకే పంటను సాగు చేయకుండా వేర్వేరు పంటలను పండించాలని సూచించారు. మక్కజొన్నలు ఈ వర్షాకాలంలో పండించవద్దు అని దానివల్ల భూసారం తగ్గుతుంది అని తెలిపారు. పంటలు పండించే రైతులు నష్టపోకుండా చూడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ మంజుల రమేశ్, ఏడీఏ వినోద్, మునిసిపల్ కమిషనర్ భోగేశ్వర్లు, టీఆర్ఎస్ వికారాబాద్ టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, ఏవో వికారాబాద్ ప్రసన్న, చిగుల్లపల్లి రమేష్ గారు, విజయ్ కుమార్, కౌన్సిలర్ లు ప్రభాకర్ రెడ్డి, అనంత్ రెడ్డి, నాయకులు లక్ష్మణ్, సుబాన్ రెడ్డి గారు, ఇతర నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Next Story