రిలయన్స్ సంస్థ బోర్డులో అరామ్‌కో ఛైర్మన్?

by  |
రిలయన్స్ సంస్థ బోర్డులో అరామ్‌కో ఛైర్మన్?
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ(ఆర్ఐఎల్)తో సౌదీ అరామ్‌కోతో ఒప్పందానికి సంబంధించి ఈ వారంలో జరగనున్న రిలయన్స్ వార్షిక సాధారణ సమావేశాల (ఏజీఎం)లో కీలక ప్రకటన వెలువడనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సౌదీ అరామ్‌కో ఛైర్మన్ యాసిర్ అల్ రుమయ్యన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో చేరే అవకాశాలున్నాయని సమాచారం. ఈ ఒప్పందం విలువ 15 బిలియన్ డాలర్లు(రూ. 1.12 లక్షల కోట్లు) అన్న సంగతి తెలిసిందే.

జూన్ 24న జరిగే రిలయన్ ఏజీఎం సమావేశంలో ఆర్ఐఎల్ బోర్డు లేదంటే కొత్తగా విభజించిన ఆయిల్-టూ-కెమికల్స్ యూనిట్ నుంచి స్పష్టమైన ప్రకటన రావొచ్చు. గతేడాది ఆర్ఐఎల్‌కు చెందిన డిజిటల్, రిటైల్ వ్యాపారాల్లో గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్, క్వాల్‌కమ్ లాంటి దిగ్గజ సంస్థలు చేరాయి. ‘కొత్తగా జరిగే ఏజీఎం సమావేశంలో సౌదీ అరామ్‌క్‌తో ఒప్పందంపై ప్రకటన ఉంటుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా సౌదీ అరామ్‌కో ఛైర్మన్ ఆర్ఐఎల్ బోర్డులో చేరవచ్చని అంచనాలున్నాయి. దీంతో పాటు గూగుల్ భాగస్వామ్యంలో కొత్త బడ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌పై స్పష్టత ఉంటుందని’ బ్రోకరేజ్ సంస్థ హెచ్ఎస్‌బీసీ గ్లోబల్ రీసెర్చ్ తన నివేదికలో తెలిపింది.

ఈ సమావేశంలో 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయవచ్చనే అంచనాలున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఉన్న వాటి కంటే చాలా తక్కువ ధరకే తీసుకురానున్నట్టు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా, ఇదే సమావేశంలో సరసమైన ధరలో ల్యాప్‌టాప్‌ను కూదా తెచ్చే అవకాశాలున్నాయి.

Next Story

Most Viewed