ఎస్ఈసీ మార్పుపై హైకోర్టులో విచారణ

by  |
ఎస్ఈసీ మార్పుపై హైకోర్టులో విచారణ
X

ఏపీలో రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి రమేష్‌కుమార్ వివాదంపై హైకోర్టులో నేడు వాదనలు జరిగాయి. ఎస్ఈసీగా రమేష్ కుమార్‌ను ఆర్డినెన్స్ ద్వారా తొలగించడంపై రమేష్ కుమార్‌తో పాటు టీడీపీ తరపున వర్ల రామయ్య, బీజేపీ తరపున మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, మాజీ మంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరరావు తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని వివరణ కోరింది.

తమకు పిటిషన్లు కూడా అందలేదని… దీనిపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు నెల రోజుల గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. అంతే కాకుండా మిగిలిన పిటిషన్లన్నింటినీ రద్దు చేసి, కేవలం రమేష్‌ కుమార్‌ పిటిషన్‌‌ను మాత్రమే విచారణకు అనుమతించాలని ఆయన న్యాయస్థానానికి సూచించారు. దీనిపై బీజేపీ తరపు న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌..

ఎన్నికలు వాయిదా వేయాలని కోరినవారిలో తమ పిటిషన్‌దారుడు కామినేని కూడా ఒకరని న్యాయస్థానానికి గుర్తు చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని తెలిపింది.

అయితే సాయంత్రంలోగా పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాదికి అందించాలని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు నెల రోజుల గడువు ఇవ్వలేమని స్పష్టం చేసింది. మూడురోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. దీంతో ప్రభుత్వ న్యాయవాది రమేష్ కుమార్ తొలగింపుపై ఈనెల 17లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

tags: sec, andhra pradesh, ramesh kumar, justice kanagaraj, ap sec, state election commissioner



Next Story

Most Viewed